భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌ | India Economy Strong Resilience Global Challenges RBI Deputy Governor | Sakshi
Sakshi News home page

భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

Jun 7 2026 7:55 AM | Updated on Jun 7 2026 11:31 AM

India Economy Strong Resilience Global Challenges RBI Deputy Governor

ముంబై: రాజకీయ, భౌగోళిక సవాళ్ల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను చూపుతున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ జే. స్వామినాథన్‌ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకు పారిశ్రామిక, సరీ్వసుల రంగాలు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా విస్తృత డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్‌ ఫలితాలు తదితర అంశాలు వ్యవస్థ ప్రగతిశీలతకు మద్దతిస్తున్నట్లు వివరించారు.

ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నట్లు కొలంబియా యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌(ఎస్‌ఐపీఏ) వద్ద ప్రసంగంలో సోమవారం ప్రస్తావించారు. విదేశీ ఆటుపోట్లను తట్టుకోగలమని ఈ సందర్భంగా తెలియజేశారు. జియోపాలిటిక్స్, వాతావరణ మార్పులు, ఏఐ, టెక్నాలజీ సవాళ్లపై ప్రపంచ పాలసీలు ఆధారపడుతున్న సందర్భంలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రసంగాన్ని ఆర్‌బీఐ తాజాగా వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement