నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి | Index of Industrial Production slowdown primarily due to weaker manufacturing activity | Sakshi
Sakshi News home page

నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి

Feb 13 2025 8:26 AM | Updated on Feb 13 2025 10:48 AM

Index of Industrial Production slowdown primarily due to weaker manufacturing activity

న్యూఢిల్లీ: మైనింగ్, తయారీ రంగాల పేలవ పనితీరుతో  డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించింది. ఐఐపీ (పారిశ్రామికోత్పత్తి సూచీ) 3 నెలల కనిష్ట స్థాయిలో 3.2 శాతానికి పరిమితమైంది. 2023 డిసెంబర్‌లో ఇది 4.4 శాతంగా నమోదైంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌ గణాంకాలను 5.2 శాతం నుంచి 5 శాతానికి సవరించింది. అటు ఐఐపీ వృద్ధి సెప్టెంబర్‌లో 3.2 శాతంగా, అక్టోబర్‌లో 3.7 శాతంగా నమోదైంది.

  • డిసెంబర్‌లో తయారీ రంగ ఉత్పత్తి 4.6 శాతం నుంచి 3 శాతానికి నెమ్మదించింది. అలాగే మైనింగ్‌ ఉత్పత్తి సైతం 5.2 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది.

  • విద్యుదుత్పత్తి 1.2 శాతం నుంచి 6.2 శాతానికి, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 5.2 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌/నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ 5.5 శాతం నుంచి 6.3 శాతానికి వృద్ధి చెందింది.  

ఇదీ చదవండి: ఓఎన్‌జీపీఎల్‌ చేతికి అయానా రెన్యూవబుల్‌

ఐఐటీ–మద్రాస్‌తో ఎస్‌ఈఐఎల్‌ ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులలో ఒకటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ తాజాగా ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కార్బన్‌ క్యాప్చర్‌ (బొగ్గు పులుసు వాయువును సంగ్రహించే) సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. కార్బన్‌ క్యాప్చర్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్‌ కలిగిన కీమోజెల్‌ అనే నానోపారి్టకల్‌ ఆధారిత ద్రావకాన్ని ఐఐటీ మద్రాస్‌ ఇప్పటికే సృష్టించింది. ఇప్పుడు క్షేత్ర స్ధాయిలో ఈ ద్రావకం పనితీరును పరీక్షించేందుకు ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ విప్లవాత్మక పరిశోధనకు మద్దతుగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.71 లక్షల నిధులు సమకూరుస్తున్నట్టు ఎస్‌ఈఐఎల్‌ సీఈవో రాఘవ్‌ త్రివేది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement