స్థిరంగా పారిశ్రామిక ఉత్పత్తి | India IIP rises 4 percent in September amid robust electrical and metal output | Sakshi
Sakshi News home page

స్థిరంగా పారిశ్రామిక ఉత్పత్తి

Oct 29 2025 2:48 AM | Updated on Oct 29 2025 2:48 AM

India IIP rises 4 percent in September amid robust electrical and metal output

సెప్టెంబర్‌లో 4 శాతం వృద్ధి 

తయారీ రంగం జోరు

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సెప్టెంబర్‌ నెలలో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ రంగం చక్కని పనితీరు చూపించడం ఇందుకు అనుకూలించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది సెప్టెంబర్‌ నెలలో 3.2 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం...  

⇒  తయారీ రంగంలో 4.8 శాతం పెరుగుదల కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో తయారీ రంగంలో వృద్ధి 4 శాతంగా ఉంది. తయారీలోనూ మొత్తం 23కు గాను 13 విభాగాల్లో సానుకూల వృద్ధి కనిపించింది.
⇒  మైనింగ్‌ రంగంలో ఉత్పత్తి మైనస్‌ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 0.2 శాతం పెరిగింది.  

⇒  విద్యుదుత్పత్తి 3.1% పెరిగింది. క్రితం ఏడాది సెప్టెంబర్‌లో 0.5% మేర ఈ రంగంలో ఉత్పత్తి పెరగడం గమనార్హం. 
⇒ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం 4.7 శాతం వృద్ధిని చూసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 3.5 శాతంగానే ఉంది.
⇒ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలో 10.2 శాతం వృద్ధి నమోదైంది.

⇒  కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగంలో ఉత్పత్తి 2.9 శాతం క్షీణించింది.
⇒ ఇన్‌ఫ్రా/నిర్మాణరంగ వస్తువుల్లో 10.5 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 3.5 శాతం వృద్ధితో పోల్చి చూస్తే మూడింతలైంది.
⇒  ప్రైమరీ గూడ్స్‌ రంగంలోనూ 10.5 శాతం వృద్ధి కనిపించింది. 
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఐఐపీ 3 శాతం వృద్ధి చెందింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి 4.1 శాతంతో పోల్చితే స్వల్పంగా తగ్గింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement