పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్‌..! | Income Tax refunds of over RS 144328 crore issued so far this fiscal | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్‌..!

Dec 22 2021 7:35 PM | Updated on Dec 22 2021 7:36 PM

Income Tax refunds of over RS 144328 crore issued so far this fiscal - Sakshi

పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను జమ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. 1, ఏప్రిల్, 2021 నుండి 20 డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖ 1.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,44,328 కోట్లను రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ. 2.11 లక్షలకు కార్పొరేట్‌ కేసులలో రూ.95,133 కోట్లను రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. 1,35,35,261 సంస్థలకు రూ.49,194 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. 

(చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?)

Advertisement
 
Advertisement
Advertisement