
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, డిబెంచర్ల జారీ ద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు వెల్లడించింది. వీటిపై కూపన్ రేటు వార్షికంగా 10.25 శాతం వరకు ఉంటుంది. ఈ నిధులను వ్యాపారరీత్యా క్లయింట్లకు రుణాలు ఇచ్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఇష్యూ ఏప్రిల్ 23న ముగుస్తుంది. 15 నెలల నుంచి 60 నెలల వరకు కాల వ్యవధులకు కంపెనీ ఈ డిబెంచర్లను జారీ చేయనుంది.
శ్రీరామ్ ఏఎంసీలో వాటాకు ఓకే
శ్రీరామ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఎస్‌ఏఎంసీ)లో సంయుక్తంగా వాటా కొనుగోలు చేసేందుకు దక్షిణాఫ్రికా సంస్థ సన్లామ్‌తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఎస్‌ఏఎంసీ విస్తారిత వోటింగ్ వాటా మూలధనంలో 23 శాతానికి సమానమైన వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా సన్లామ్ గ్రూప్‌నకు చెందిన సంస్థ సన్లామ్ ఎమర్జింగ్ మార్కెట్(మారిషస్) సొంతం చేసుకోనుంది.
ఎస్‌ఏఎంసీ ఈక్విటీ షేర్లలో సబ్‌స్క్రిప్షన్ ద్వారా వాటా పొందనుంది. ఇదేవిధంగా ఎస్‌ఏఎంసీ పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి సన్లామ్ ఎమర్జింగ్‌తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.