కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లపై హ్యుందాయ్‌ ప్రకటన | Hyundai Motor India says all its vehicles to come with 6 airbags | Sakshi
Sakshi News home page

కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లపై హ్యుందాయ్‌ ప్రకటన

Oct 4 2023 7:21 AM | Updated on Oct 4 2023 10:58 AM

Hyundai Motor India says all its vehicles to come with 6 airbags - Sakshi

న్యూఢిల్లీ: ఇకపై తమ అన్ని కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరిగా ఉంటాయని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ముందుగా 3 మోడల్స్‌తో దీన్ని ప్రారంభించనున్నామని, తర్వాత మిగతా మోడల్స్‌కూ వర్తింపచేస్తామని సంస్థ ఎండీ ఉన్సూ కిమ్‌ తెలిపారు.

వాహన భద్రతా ప్రమాణాలపరమైన దేశీ క్రాష్‌ టెస్టులకు సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టిన భారత్‌ ఎన్‌క్యాప్‌ ప్రోగ్రామ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నట్లు వివరించారు.

టెస్టుల ఆధారంగా వాహనానికి 0–5 వరకు స్టార్‌ రేటింగ్స్‌ లభిస్తాయి. కొనుగోలుదారులు ఈ రేటింగ్‌ ప్రాతిపదికన వివిధ కార్లలో భద్రతా ప్రమాణాలను పోల్చి చూసుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చు. తమ మధ్య స్థాయి సెడాన్‌ కారు వెర్నాకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్టులో 5 స్టార్‌ రేటింగ్‌ లభించినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement