
కార్పొరేట్ కంపెనీలు, కొత్తగా ప్రారంభమవుతున్న స్టార్టప్‌లు తమ పేర్లను ‘Z’ అనే అక్షరంతో ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇలా కంపెనీలు Zతో పేర్లను ప్రారంభించడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ పంథాను ఇప్పటికే అనుసరించిన కొన్ని ప్రముఖ కంపెనీల వివరాలను కింద చూద్దాం.
Gen Zతో అనుబంధం
జెన్‌జీ- 1990 నుంచి 2010ల మధ్య జన్మించిన Gen Z (జనరేషన్ Z) ప్రస్తుతం ప్రపంచ వినియోగదారుల్లో, శ్రామిక శక్తిలో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఈ తరం డిజిటల్ నేటివ్‌గా మారుతున్నారు. వీరు వేగవంతమైన మార్పులను అంగీకరించే వారిగా ఉన్నారు. కంపెనీ పేరులో 'Z' ఉండటం ద్వారా తాము ఈ ఆధునిక, సాంకేతికత ఆధారిత, డైనమిక్ తరానికి చెందినవారమని, వారి అవసరాలను తీర్చగలమని పరోక్షంగా కంపెనీలు సందేశం పంపవచ్చు.
'Z' అక్షరం యువతలో ట్రెండీగా, విభిన్నంగా కనిపిస్తుంది. ఇది కొత్తదనాన్ని, భవిష్యత్తు, సాంప్రదాయేతర విధానాన్ని సూచిస్తుంది.
మార్కెట్‌లో విభిన్నత
ఆంగ్ల అక్షరమాల (Alphabet)లో చివరి అక్షరం 'Z'. ఇది ఒక కంపెనీని సులభంగా గుర్తుంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. 'A' లేదా 'G'.. వంటి సాధారణ అక్షరాలతో పోలిస్తే 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కంపెనీ పేరు వేగంగా దృష్టిని ఆకర్షిస్తుంది.
కొన్నిసార్లు వెబ్‌సైట్ డైరెక్టరీల్లో లేదా యాప్ స్టోర్‌ల్లో (A-Z జాబితా) పేర్లు ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉన్నప్పుడు 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు జాబితాలో చివరిలో కనిపించి వినియోగదారులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది.
డొమైన్ నేమ్స్
ఇంటర్నెట్‌లో కొత్త స్టార్టప్‌లకు తమకు నచ్చిన పేరుతో డొమైన్ పేరు (ఉదా: example.com) దొరకడం చాలా కష్టం. 'Z' అక్షరం అరుదుగా ఉపయోగించబడటం వల్ల ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అర్థవంతమైన పేర్లు, వాటికి అనుగుణమైన డొమైన్ నేమ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ సులభంగా లభిస్తాయి.
'Z' తో ప్రారంభమయ్యే పేర్లను తరచుగా పలకడం, వినడం సులువుగా ఉంటుంది. (ఉదాహరణకు: జెప్టో, జొమాటో). ఇది వేగవంతమైన డిజిటల్ యుగానికి సరిపోయేలా ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
'Z' అక్షరంతో ప్రారంభమైన ప్రముఖ కంపెనీలు
కంపెనీ | స్థాపించబడిన దేశం | ప్రధాన వ్యాపారం |
---|---|---|
Zepto | భారతదేశం | క్విక్ కామర్స్ (10 నిమిషాల కిరాణా డెలివరీ) |
Zetwerk | భారతదేశం | మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ (B2B) |
Zomato | భారతదేశం | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ అగ్రిగేటర్ |
Zerodha | భారతదేశం | ఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ (ట్రేడింగ్) |
Zillow | అమెరికా | రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ |
Zoom | అమెరికా | వీడియో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ |