మందుమాకులతో పనిలేదు..అలెర్జీలను తరిమికొట్టే పరికరం! | Sakshi
Sakshi News home page

మందుమాకులతో పనిలేదు..అలెర్జీలను తరిమికొట్టే పరికరం!

Published Sun, Sep 4 2022 10:48 AM

How To Stop Allergies Immediately Naturally - Sakshi

వాతావరణం మారినప్పడు, గాలిలో దుమ్ము ధూళి పుప్పొడి రేణువులు వంటివి రేగినప్పుడు రకరకాల అలెర్జీలు ఇబ్బందిపెడుతుంటాయి. తుమ్ములు, దగ్గులు, హే ఫీవర్‌లాంటి జ్వరాలతో బాధపడాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి.

అలెర్జీలతో బాధపడేటప్పుడు వైద్యుల వద్దకు వెళితే యాంటీహిస్టామిన్‌ మందులు ఇస్తుంటారు. కొందరిలో అలెర్జీలు ఉబ్బసానికి కూడా దారితీస్తుంటాయి. అలాంటప్పుడు కార్టికో స్టిరాయిడ్స్‌తో కూడిన మందులు, కార్టికో స్టిరాయిడ్స్‌ను మోతాదుగా విడుదల చేసే ఇన్‌హేలర్స్‌ వాడాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి మందుమాకులతో పనిలేకుండా, అలెర్జీలు పరారయ్యేలా చేసే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చేసింది.

చూడటానికి ఇన్‌హేలర్‌లా ఫొటోలో కనిపిస్తున్నది అదే! ఇందులో ఎలాంటి ఔషధాలూ ఉండవు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫ్లూవో ల్యాబ్స్‌’ ఈ పరికరాన్ని రూపొందించింది. గాలిలో తేడా ఉన్నప్పుడు దీనిని ముక్కు వద్ద ఉంచుకుని స్విచాన్‌ చేయాలి. దీని నుంచి వెలువడే నానో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు శరీరం నుంచి హిస్టామిన్స్‌ వెలువడకుండా నిరోధించి, అలెర్జీ ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement