కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న ఇళ్ల ధరలు!

Homebuyers Expect Housing Prices to Rise Over the next 6 months: Survey - Sakshi

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. వచ్చే 6 నెలల్లో గృహల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ నివేదిక తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చుల వల్ల వచ్చే ఆరు నెలల్లో హౌసింగ్ ధరలు పెరుగుతాయని ప్రముఖ హౌసింగ్ పోర్టల్ Housingcom, రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO కలిసి నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో వినియోగదారుల మనోభావాలను అంచనా వేయడానికి 3,000 మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించినట్లు ఈ సర్వే పేర్కొంది.

'రెసిడెన్షియల్ రియల్టీ కన్స్యూమర్ సెంటిమెంట్ అవుట్‌లుక్(జనవరి-జూలై 2022)' నివేదిక పేర్కొన్న వివరాల ప్రకారం.. 100 మందిలో 47% మంది వినియోగదారులు రియల్ ఎస్టేట్'లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని ఈ సర్వే హైలైట్ చేసింది. స్టాక్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వంటి వాటిలో పెట్టె పెట్టుబడితో పోలిస్తే ఇది అత్యధికం. 2020 ద్వితీయార్ధంలో నిర్వహించిన సర్వేలో కేవలం 35 శాతం మంది మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరిచారు.  

"కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రజలు గృహాల కొనుగోలుకు సిద్దం అవుతున్నారు. గత ఏడాది 2021లో డిమాండ్ పెరగడంతో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగాయని మా డేటా చూపించింది. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్ కంటే ముందు స్థాయి అమ్మకాలను దాటుతాయని మేము బలంగా నమ్ముతున్నాము" అని Housingcom గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ అన్నారు. ఈ సర్వే ప్రకారం.. కొత్త ఇళ్లు కొనాలని చూస్తున్న వారిలో సగానికి పైగా (51 శాతం) రాబోయే ఆరు నెలల్లో గృహ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం నిర్మాణ వ్యయం పెరగడం. అదే సమయంలో 73 శాతం మంది ప్రజలు ఇంటి కొనుగోలుకి ప్రణాళిక వేసుకుంటున్నారు. 

ఇందుకు అనుగుణంగా తగ్గింపు ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును పెంచాలి, నిర్మాణ సామగ్రిపై వస్తు సేవల పన్ను(జిఎస్టి) ను తగ్గించాలని, చిన్న డెవలపర్లకు రుణ లభ్యతను విస్తరించాలని, గృహ కొనుగోళ్ల డిమాండ్ పెంచడానికి స్టాంప్ డ్యూటీని అన్నీ రాష్ట్రాలు తగ్గించాలని ఈ నివేదిక సూచించింది.

(చదవండి: లాంగ్‌ టర్మ్‌లో మంచి ప్రాఫిట్‌ ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top