హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం..! టీసీఎస్‌ స్థానం గల్లంతు..!

Hdfc Twins Merger the Second Largest Company in India Beating Tcs - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మార్ట్‌గేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో  స్టాక్‌ మార్కెట్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ కంపెనీ షేర్లు భారీ లాభాలను గడించాయి. కాగా ఈ సంస్థల విలీన నిర్ణయం దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)కు గట్టి షాక్‌ను ఇచ్చింది.  

టీసీఎస్‌ స్థానం గల్లంతు..!
ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ సంస్థ టీసీఎస్‌ను అధిగమించి భారత్‌లో రెండో అతిపెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ కల్గిన కంపెనీగా అవతరించనుంది. ఏప్రిల్ 4న ఉదయం 11:15 గంటల నాటికి, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కలిసి రూ. 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండగా, టీసీఎస్‌ మార్కెట్ క్యాప్ రూ. 13.95 లక్షల కోట్లుగా ఉంది.

18 నెలలు పట్టే అవకాశం..!
ఇరు సంస్థల విలీన ప్రక్రియకు రెగ్యులేటరీ నుంచి అనుమతులు రావడానికి సుమారు 18 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. 

చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. దూసుకుపోతున్న షేర్ల ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top