హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. దూసుకుపోతున్న షేర్ల ధరలు

HDFC To Be Merged Into HDFC Bank - Sakshi

HDFC Merge With HDFC Bank: హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) సంంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ విలువ పెంచేలా ఇన్వెస్టర్లకు మరింత లాభాలు అందించే చర్యల్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీని పూర్తిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం చేస్తున్నట్టు సోమవారం సెబీకి తెలిపింది.

ఈ విలీనం పూర్తైన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీలో ప్రతీ 25 షేర్లకు బదులుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకువి 45 షేర్లు బదలాయిస్తారు. ఈ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానున్నాయి. విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా దఖలు పడనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల నుంచి విలీన ప్రకటన రావడంతో దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ అవతరించనుంది. ఈ విలీన ప్రకటన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటల్‌ 12 లక్షల కోట్లకుపైకి చేరుకుంది. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ మారనుంది.

విలీన ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9.43 శాతం లాభపడి 2,683 దగ్గర ట్రేడవుతోంది. ఇవాల ఒక్కరోజే రూ.231 లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 8.43 శాతం లాభంతో రూ. 1633 దగ్గర ట్రేడవుతోంది. 

చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top