కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌..!

Hdfc Sells 10pc Stake in Hdfc Capital to Adia for Rs 184 CR - Sakshi

న్యూఢిల్లీ: పీఈ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌లో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ (ఏడీఐఏ)కి చెందిన పూర్తి అనుబంధ సంస్థకు వాటాను రూ. 184 కోట్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది.

కాగా.. 3 బిలియన్‌ డాలర్ల విలువైన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ నిర్వహణలోని ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లోనూ ఏడీఐఏ ప్రధాన ఇన్వెస్టర్‌గా నిలుస్తుండటం గమనార్హం. 2016లో ఏర్పాటైన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌.. అఫర్డబుల్‌ రియల్టీ ఫండ్స్‌ 1, 2, 3లకు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. 

చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్‌డీఎఫ్‌సీ’ చీఫ్‌ల భేటీ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top