ఇకపై ఆ రేంజ్ ఉంటేనే యాక్షన్.. | GST Council Reforms 2026 Arrest Powers Scrapped Faster Refunds Major Relief | Sakshi
Sakshi News home page

ఇకపై ఆ రేంజ్ ఉంటేనే యాక్షన్.. జీఎస్టీ కౌన్సిల్ ముఖ్యాంశాలు

Oct 9 2026 12:06 PM | Updated on Oct 9 2026 12:09 PM

GST Council Reforms 2026 Arrest Powers Scrapped Faster Refunds Major Relief

భారతదేశంలో చిన్న పరిశ్రమలకు ఎంతో ఉపశమనం కలిగిస్తూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యాపారుల్లో భయాందోళనలను తొలగించేందుకు పన్ను ఆఫీసర్ల అరెస్ట్ అధికారాలను తొలగించడం సహా, ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.5 కోట్లకు పెంచడం వంటి ప్రతిపాదనలను ఆమోదించింది. రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పరిధిని విస్తరించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు సులభతర వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

సమావేశంలోని ముఖ్యాంశాలు

  • అరెస్టులు రద్దు.. ప్రాసిక్యూషన్ పరిమితి పెంపు: జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేశారు. అలాగే ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు రూ.1 కోటిగా ఉన్న పన్ను పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు.

  • సాధారణ జరిమానా తగ్గింపు: నిర్దిష్ట నిబంధనలు లేని ఉల్లంఘనలకు విధించే సాధారణ జరిమానాను రూ.25,000 నుంచి రూ.10,000 కు తగ్గించారు.

  • వేగవంతమైన రీఫండ్‌లు: అర్హత కలిగిన రీఫండ్‌లలో 90% క్లెయిమ్‌లను 3 పని దినాల్లోనే ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తారు.

  • రీఫండ్ రసీదు గడువు తగ్గింపు: రీఫండ్ దాఖలు చేసిన తర్వాత రసీదు ఇచ్చే గడువును 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించారు.

  • ఆటో-అప్రూవల్ సదుపాయం: సాధారణ జీఎస్టీ సవరణలలో 65% ప్రక్రియలను ఆటోమేటిక్ అప్రూవల్ పద్ధతిలో వేగవంతం చేస్తారు.

  • ఐటీసీ పరిధి విస్తరణ: ఉద్యోగుల హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్, టెలికాం టవర్లు, పైప్‌లైన్‌లపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి ప్రతిపాదించారు.

  • ఇన్వర్టెడ్ డ్యూటీ రీఫండ్‌లు: ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద ఇన్పుట్ సర్వీసెస్ (సేవలకు) కూడా రీఫండ్ ప్రయోజనాన్ని నవంబర్ 1, 2026 నుంచి విస్తరించనున్నారు.

  • ఈ-కామర్స్ విక్రేతలకు వెసులుబాటు: చిన్న వ్యాపారులు, విక్రేతలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయాలు జరపడాన్ని మరింత సులభతరం చేశారు.

  • సరుకు రవాణా వాహనాల తనిఖీ నిబంధనలు: స్పష్టమైన నిఘా సమాచారం, ముందస్తు అధికారుల అనుమతి ఉన్నప్పుడు మాత్రమే సరుకు రవాణా వాహనాలను తనిఖీల కోసం నిలిపివేస్తారు.

  • పన్ను రేట్లలో మార్పు లేదు: జీఎస్టీ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పన్ను రేట్ల సమీక్షలను ఇకపై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: భారత్‌కు ‘స్టార్‌లింక్’ నిజంగా సంజీవనియా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement