కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్

హైదరాబాద్: కెనరా బ్యాంక్ నూతనంగా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.75 శాతం వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇందులో నాన్ కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందు ఉపసంహరించుకోలేనివి)పై 7.25 శాతం రేటును ఆఫర్ చేస్తుండగా, కాలబుల్ డిపాజిట్‌పై (గడువుకు ముందు రద్దు, పాక్షిక ఉపసంహరణకు వీలైనవి) 7.15 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తున్నట్టు కెనరా బ్యాంక్ తెలిపింది. 60 ఏళ్లు నిండిన వారికి 0.50 శాతం అదనపు రేటును ఇస్తోంది.
మరిన్ని వార్తలు :