వరుసగా రెండో వారంలోనూ పసిడికి దెబ్బ, వెండి అక్కడక్కడే

Gold prices fall to near two week lows silver rates struggle - Sakshi

సాక్షి, ముంబై: గ్లోబల్‌ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.  అటు ఎంసీఎక్స్‌లో  గోల్డ్‌  ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాముల పసిడి ధర రూ 50,510గా ఉండగా, వెండి ఫ్యూచర్స్‌ కిలో 59,510 వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి. 

దేశీయంగా  హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల  గ్రాము పసిడి ధర రూ. 4745గా ఉంది.  24 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ. 4765గా ఉంది. వెండి కిలో ధర 66 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అంటే వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టాయి.  గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు 1,824.72  డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి. 

గ్లోబల్‌గా ఆర్థికమాంద్య భయాలు, అదుపులేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి  సెంట్రల్ బ్యాంక్‌లు దూకుడుగా రేట్ల పెంచనున్నాయనే ఆందోళనతో బంగారం ధరలు దాదాపు 0.9శాతం తగ్గాయి.  సిల్వర్ ఔన్స్‌కు 0.4శాతం పెరిగి 21.02 వద్ద ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే లక్ష్యంతో వడ్డీ రేట్ల పెంపుపై యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌ పావెల్ వ్యాఖ్యలు డాలర్‌కు బలాన్నిచ్చాయి. 

అటు గోల్డ్ ఇటిఎఫ్‌లలోకి ఇన్‌ఫ్లోలు ఇటీవలికాలంలో మిశ్రమంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్  ఎస్‌పీడీఆర్‌ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ గురువారం1,071.77 టన్నుల నుంచి 0.81 శాతం  తగ్గి 1,063.07 టన్నులకు పడిపోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top