గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌ | Ganesh Chaturthi Mukesh Ambani Huge Haar At Lalbaugcha Raja Antilia Decked | Sakshi
Sakshi News home page

గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌

Sep 19 2023 4:28 PM | Updated on Sep 20 2023 5:58 PM

Ganesh Chaturthi Mukesh Ambani Huge Haar At Lalbaugcha Raja Antilia Decked - Sakshi

పవిత్ర గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ కుటుంబం జరుపుకున్న వినాయక చవితి వేడుకులు విశేషంగా నిలిచాయి. ముంబైలోని వీరి లగ్జరీ నివాసం యాంటిలియా విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయింది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే,ఈ ఏడాదికూడా మహారాష్ట్రలోని ముంబైలోని లాల్‌బాగ్‌లో లాల్‌బాగ్చా రాజా ప్రజలు దర్శనం కోసం అందంగా కొలువు దీరాడు. ప్రతీ ఏడాది   అంబానీకుంటుంబంతోపాటు, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు  ఈ గణపతిని దర్శించుకుంటారు. ఈ ఏడాది మాత్రం ఈ వేడుకను అంబానీ కుటుంబం మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. ముఖేష్‌  తన చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి లాల్‌బాగ్చా రాజాను సందర్శించి గణేశుడిని ప్రార్థనలు చేశారని తెలుస్తోంది. 


(ఫైల్‌ ఫోటో )

ఈ సందర్బంగా  భారీ దండను కూడా బొజ్జ గణపయ్యకు అందించడం విశేషంగా నిలిచింది. తండ్రి కొడుకులిద్దరూ సంప్రదాయ  దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముఖేష్ అంబానీ నీలిరంగు కుర్తా-పైజామాను ధరించగా, అనంత్ అంబానీ మెరూన్-హ్యూడ్ దుస్తుల్లో విఘ్ననాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌ ఫోటోలతోపాటు, పాత వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement