haaram
-
Nita Ambani: కోడలికి గిఫ్ట్‌గా కోట్ల విలువైన 'ఖాందానీ హార్'! ప్రత్యేకత ఇదే
కోట్లకు పడగలెత్తితే..ఆ కుంటుంబాల్లో ఇచ్చే బహుమతులు, కానుకలు వార్తల్లో నిలుస్తాయి. డబ్బుంటే ఆ రేంజ్‌కి తగ్గ బహుమతులతో ప్రేమను కురిపిస్తారు. బడా వ్యక్తుల మధ్య ప్రేమ కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అలాంటి కోవలో మొదటి స్థానంలో నిలిచేది అంబానీల కుటుంబమే. ఇటీవల కాలంలో ఆ ఇంట జరిగిన విలాసవంతమైన వివాహ వేడుకలే అందుకు నిదర్శనం. గతేడాది చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి వేడుక ఎంత విలాసవంతంగా జరిగిందో తెలిసిందే. అదీగాక చిన్న కోడలు రాధికా మర్చంట్‌కి అంబానీ కుటుంబం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు కూడా హైలెట్‌గానే నిలిచాయి. తాజాగా నీతా అంబానీ తన అందమైన కోడలు రాధికాకు మరో అద్భుతమైన నెక్లెస్‌ని కానుకగా ఇచ్చింది. అది వారి కుటుంబ వారసత్వానికి సంబంధించిన నగ అట. మరీ ఆ నెక్లెస్ విశేషాలెంటో చూద్దామా..!అంబానీలు కుటుంబ సంప్రదాయాలకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో భాగంగానే తమ వారసత్వాన్ని సూచించే విలువైన వస్తువులను వారి కోడళ్లకు బహుమతులుగా ఇస్తుంటారు. అలానే చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్(Radhika Merchant)కి పచ్చలు, వజ్రాలతో పొదిగిన 'ఖందానీ హార్(khandani haar)'ని బహుమతిగా ఇచ్చారట నీతా అంబానీ(Nita Ambani ). దీని ఖరీదు రూ. 1.8 కోట్లు పైనే ఉంటుందట. ఈ నెక్లెస్ అంబానీల కుటుంబ వారసత్వం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విలువైన నగ అట. నీతా ఇంతకు మునుపు కూడా ఇలానే ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఖరీదైన చోకర్‌ని బహుమతిగా ఇచ్చారు. నిజానికి కుటుంబ బంధంతో ముడిపడి ఉన్న నగలు విలువ వెలకట్టలేం. కాగా, నీతా ఇలా తన పెద్ద కోడలు శ్లోకా మెహతాకు కూడా అత్యంత ఖరీదైన మౌవాద్ ఎల్'ఇన్‌కంపారబుల్ నెక్‌పీస్ నగని బహుమతిగా ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలతో డిజైన్ చేసిన నగ ఇది. ఇలాంటి విలాసవంతమైన బహుమతులతో అంబానీ కుటుంబ సంప్రదాయాలు, వైభవం ఒకదానికొకటి గట్టిగా ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.(చదవండి: ఎవరీ విశ్వనాథ్ కార్తికే..? జస్ట్ 16 ఏళ్లకే అరుదైన ఘనత సాధించాడు!) -
గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్
పవిత్ర గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ కుటుంబం జరుపుకున్న వినాయక చవితి వేడుకులు విశేషంగా నిలిచాయి. ముంబైలోని వీరి లగ్జరీ నివాసం యాంటిలియా విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే,ఈ ఏడాదికూడా మహారాష్ట్రలోని ముంబైలోని లాల్‌బాగ్‌లో లాల్బాగ్చా రాజా ప్రజలు దర్శనం కోసం అందంగా కొలువు దీరాడు. ప్రతీ ఏడాది అంబానీకుంటుంబంతోపాటు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ గణపతిని దర్శించుకుంటారు. ఈ ఏడాది మాత్రం ఈ వేడుకను అంబానీ కుటుంబం మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. ముఖేష్ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి లాల్బాగ్చా రాజాను సందర్శించి గణేశుడిని ప్రార్థనలు చేశారని తెలుస్తోంది. (ఫైల్ ఫోటో ) ఈ సందర్బంగా భారీ దండను కూడా బొజ్జ గణపయ్యకు అందించడం విశేషంగా నిలిచింది. తండ్రి కొడుకులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముఖేష్ అంబానీ నీలిరంగు కుర్తా-పైజామాను ధరించగా, అనంత్ అంబానీ మెరూన్-హ్యూడ్ దుస్తుల్లో విఘ్ననాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఫోటోలతోపాటు, పాత వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by LalbaugchaRaja (@lalbaugcharaja) -
‘హారం’లో అగ్రగామి మనమే..
మొక్కలు నాటడంలో నిర్లక్ష్యాన్ని సహించం పోడు భూముల్లో గిరిజనేతరులపై పీడీ యాక్ట్ రెండు, మూడు ఎకరాల్లో పంటలు ధ్వసం చేయవద్దు సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రప్రథంలో ఉందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. వెనుకంజవేస్తే పుంజుకోవడం కష్టమన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. హరితహారం అమలు తీరుపై టీటీడీసీ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం కంటే అదనంగా మరో కోటి మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ లక్ష్యాన్ని ఈనెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు లక్ష్యం సాధించాలి జిల్లాలో కోటి మొక్కల లక్ష్యం నేరవేర్చేందుకు ఇరిగేషన్, ఎన్నెస్పీ, మున్సిపాలిటీ, గిరిజన సంక్షేమం, డీఆర్డీఏ, అటవీశాఖ అధికారులు కేటాయించిన లక్ష్యం కంటే అధికంగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా మరో అదనంగా నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్నందునా ఇదే అనుకూలం సమయం అన్నారు. ఉద్యాన, అటవీశాఖలు లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్న దృష్ట్యా వారు వేగం పెంచాలన్నారు. హరితహారం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీఆర్, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా వేసిన మొక్కలు భవిష్యత్తులో తొలగించకుండా ముందుగానే అనువైన ప్రదేశాల్లో నాటాలన్నారు. నగరంలో నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో తిరిగే పశువులను గోశాలకు పంపుతామని ప్రచారం నిర్వహించాల్సిందిగా కమిషనర్‌ను ఆదేశించారు. అటవీభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనేతరులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. 2, 3 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పంటలను ధ్వంసం చేయవద్దని, పంటలు పూర్తయిన తర్వాత అటవీశాఖ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. లీజుకు తీసుకున్న గిరిజనేతర రైతుల వివరాలు సేకరించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికి 2.97 కోట్ల మొక్కలు నాటాం: ఇన్చార్జ్ కలెక్టర్ దివ్య హరితహారంలో జిల్లా లక్ష్యం 3.50 కోట్ల మొక్కలు కాగా ఇప్పటికే 2.97 కోట్లు నాటామన్నారు. రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 2,700 హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ లక్ష్యం 53.70 లక్షలు కాగా ఇప్పటికే 37 లక్షల మొక్కలు నాటామన్నారు. 8 ప్రాంతాల్లో 365 హెక్టార్లలో సమస్యగా ఉందన్నారు. 53 లక్షల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, సమస్యాత్మక ప్రాంతంలో లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయామన్నారు. అటవీశాఖ లక్ష్యాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, హరితహారం ప్రత్యేక అధికారి రఘువీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.