
ఆహార భద్రత ప్రొటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్ సంస్థలను నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలకు చెందిన 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో జి.కమల వర్ధనరావు ఈ విషయాలు తెలిపారు.
ఈ–కామర్స్ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్‌వాయిస్‌లలో తమ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు/రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ముద్రించాలని ఆయన ఆదేశించారు. గిడ్డంగులు, స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్ పాటించాలని రావు సూచించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.