ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్ ‌: అందరికీ ఉచితమే

Flipkart to cover COVID-19 vaccination cost of all its employees - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌  గ్రూపు ఉద్యోగులందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా

ముగ్గరు డిపెండెంట్లకు కూడా ఉచితమే

ఒక రోజు సెలవు  కూడా

సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా తన ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు ఉద్యోగులందరికీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌న ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు తాజాగా ప్రకటించింది. ముగ్గురు డిపెండెంట్లతో సహా ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా ఉద్యోగులందరికీ కోవిడ్‌-19 టీకా ఖర్చును 100 శాతం  చెల్లిస్తామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాదు టీకా తీసుకునేందుకు ఒక రోజు సెలవు తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. దీంతోపాటు టీకా అనంతరం ఏదైనా  ఇబ్బంది తలెత్తితే అందుకు కోవిడ్‌ స్పెషల్ కేర్ లీవ్  కూడా ఆఫర్‌ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

తరువాతి దశపై ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని, ముగ్గురు డిపెండెంట్లతోపాటు తమ ఉద్యోగులందరికీ టీకా ఖర్చులో 100 శాతం భరించాలని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నిర్ణయించడం సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్  వెల్లడించింది. ఉద్యోగులు టీకా ఖర్చును రీ ఎంబర్స్‌ చేసుకోవడం గానీ,తమ భాగస్వామి అసుపత్రిలో ఉచితంగా టీకా తీసుకోవడం గానీ  చేయవచ్చని తెలిపింది.  లేదా సంస్థ క్యాంపస్‌లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్‌లో పాల్గొనవచ్చని చెప్పింది. కరోనా నివారణకు గాను దేశవ్యాప్తంగా రెండోవద వ్యాక్సినేషన్‌  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top