ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ను సమీక్షించాలి: ఆతిథ్య పరిశ్రమ

FHRAI Urges Finance Department Look In to Employees LTC Cash Voucher - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ స్థానంలో లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ వోచర్‌ను అనుమతించడాన్ని తిరిగి పరిశీలించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను ఆతిథ్య పరిశ్రమ కోరింది. మరో 2 నెలల్లో కేంద్రం తదుపరి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ తీసుకరానున్న నేపథ్యంలో పరిశ్రమ తన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన లేఖను హోట ల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి యా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) వైస్‌ ప్రెసిడెంట్‌ గుర్‌బక్సి సింగ్‌ కోహ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపారు.

2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించడంతో.. ఉద్యోగులు తమ ఎల్‌టీసీ (కుటుంబ సమేతంగా చేసే పర్యటనకు ఇచ్చే అలవెన్స్‌) ప్రయోజనాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కేంద్రం ఎల్‌టీసీ వోచర్‌ను తీసుకొచ్చింది. ఎల్‌టీసీ ప్రయోజనం మేర ఉత్పత్తులు, సేవల కొనుగోలుకు చెల్లింపులు చేసుకునేందుకు అనుమతించింది. పరిశ్రమ పుంజుకునేందుకు వీలుగా దీన్ని సమీక్షించాలని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ తాజాగా కోరింది.
 

చదవండి:ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top