ఆగస్ట్‌లో ఆల్‌టైమ్‌ ‘రయ్‌’! | Festive demand, strong SUV offtake propel domestic PV sales | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో ఆల్‌టైమ్‌ ‘రయ్‌’!

Sep 2 2023 4:33 AM | Updated on Sep 2 2023 4:33 AM

Festive demand, strong SUV offtake propel domestic PV sales - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్‌యూవీ(స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్స్‌)లకు డిమాండ్‌ కొనసాగడం, పండుగ సీజన్‌ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం.

హ్యుందాయ్, ఎంఅండ్‌ఎం, టయోటా కిర్లోస్కర్‌ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్‌ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement