ఆటో అమ్మకాల 'పండుగ'.. అక్టోబర్‌లో 5 లక్షలు! | Car Sales Hit Monthly Record in October 2026 | Sakshi
Sakshi News home page

ఆటో అమ్మకాల 'పండుగ'.. అక్టోబర్‌లో 5 లక్షలు!

Nov 2 2026 1:49 PM | Updated on Nov 2 2026 1:50 PM

Car Sales Hit Monthly Record in October 2026

పండుగ సీజన్‌ కలిసి రావడంతో అక్టోబర్‌లో దేశీయ ప్యాసింజర్‌ వాహనాల హోల్‌సేల్‌ విక్రయాలు రికార్డు స్థాయిలో 5 లక్షల యూనిట్ల మార్కును దాటాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి దిగ్గజ వాహన సంస్థలు తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి.

ఈ ఏడాది (2026) అక్టోబర్‌లో 5.25 లక్షల నుంచి 5.30 లక్షల మధ్య ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడై ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో నమోదైన 4.60 లక్షల యూనిట్లతో పోలిస్తే, ఈసారి వార్షిక ప్రాతిపదికన విక్రయాల వృద్ధి 13 నుంచి 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు.

మొబిలిటీ గ్లోబల్‌ లైట్‌ వెహికల్‌ ప్రొడక్షన్‌ ఫోర్‌కాస్టింగ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ వంగాళ్‌ మాట్లాడుతూ.. ''నవంబర్‌ మొదటి వారంలోనే ధనత్రయోదశి, దీపావళి పండుగలు ఉండటంతో.. డిమాండ్‌కు తగ్గట్లుగా వాహనాలను అందించేందుకు ఆటో కంపెనీలు అక్టోబర్‌లోనే డీలర్లకు భారీగా స్టాక్‌ను పంపాయి. దీంతో అక్టోబర్‌ హోల్‌సేల్స్‌ గణనీయంగా పెరిగాయి. అయితే, కస్టమర్లు వాహనాలను డెలివరీ తీసుకునే ప్రక్రియ ప్రధానంగా నవంబర్‌లోనే జరగనుంది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే అక్టోబర్‌ వాహన రిజిస్ట్రేషన్లు (రిటైల్స్‌) కొంత తగ్గే అవకాశమున్నప్పటికీ, నవంబర్‌లో ఇవి మరింత పుంజుకుంటాయి'' అని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 28.3 శాతం పెరిగి 20.55 లక్షల యూనిట్లకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement