Kara Perez Success Story: ఒకపుడు వెయిట్రెస్‌..ఇపుడు కోట్లలో సంపాదిస్తోంది..ఎలా?

ex waitress who now earns crores Kara Perez success story - Sakshi

పట్టుదల ఉండాలేగానీ ఏమైనా సాధించవచ్చుఅనేది కారాపెరెజ్‌ మరోసారి నిరూపించారు.ముఖ్యంగా కష్టాల కొలిమిలో మండిన వారు మరింత శ్రమించి విజయాలు సాధిస్తారు.  కారా పెరెజ్‌అది అలాంటి స్ఫూర్తిదాయకమైన కథే. ఎడ్యుకేషన్‌ ఫీజు కట్టడానికి అమెరికాలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంపెనీ స్థాపకురాలిగా,మనీ ఎక్స్‌పర్ట్, స్పీకర్‌గా అందరికి ఆదర్శనీయంగా నిలుస్తోంది.  

పెరెజ్  అమెరికాలో ఆస్టిన్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూన్నపుడు రూ. 15 లక్షలు (ఇండియన్‌ కరెన్సీ ప్రకారం)  సంపాదించేది. ఈ సంపాదనతో నిజానికి అక్కడ బతకడమే కష్టం. దీనికితోడు రూ.24 లక్షలకు పైగా విద్యార్థి రుణాన్ని చెల్లించాల్సి వచ్చింది. అదే ఆమెను క్రియేటివ్‌గా ఆలోచించేలా చేసింది. 2011లో పట్టభద్రురాలైన ఆమెకు ఎన్ని పార్ట్‌ టైం జాబ్‌లతో కష్టాలు తీరలేదు.  అప్పులు, తక్కువ సంపాదన అనే విష వలయం నుండి బయటపడాలని అంతకుముందే క్రియేట్‌ చేసుకున్న బ్లాగు వైపు దృష్టి పెట్టింది. రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉద్యమంలాగా దీనిపై పనిచేసింది. అప్పులన్నీ తీర్చేసింది.  మొదట్లో తన వ్యక్తిగత ప్రయాణం గురించి బ్లాగింగ్‌ చేసేది. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ స్టూడెంట్ లోన్‌లు గురించి డబ్బు, పొదుపు,  గురించి అనేక వ్యాసాలు రాసింది. అలా అనేక సమావేశాలకు స్పీకర్‌గా అవకాశం లభించింది. కాలక్రమంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం గమనించింది. దీంతో ఎక్కువగా మహిళలతోనే ఎక్కువ సమావేశమవుతూ,  అప్పులను తగ్గించు కోవడానికి లేదా పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం ప్రారంభించింది.  క్రమంగా  బ్లాగ్‌ కాస్తా  ‘బ్రేవ్లీ గో’ అనే ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ కంపెనీకి నాంది పలికింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వేచ్ఛ,  ఆర్థిక విద్య కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే తనను తాను ఫైనాన్షియల్‌ ఫెమినిస్ట్‌గా చెప్పుకుంటుంది. 

ఈ సంస్థ ద్వారా వర్క్‌షాప్‌లు, కోర్సులు, స్పీకింగ్ ఎంగేజ్‌మెంట్స్‌తో మహిళల్లో డబ్బు సంపాదన,  పొదుపు లాంటి అలవాట్లను పెంపొందించడంలో శిక్షణ ఇస్తుంది.  34 ఏళ్ల పెరెజ్‌ ఇపుడు సేల్స్‌ ద్వారా లక్ష డాలర్లు, సోషల్ మీడియా మేనేజర్, హైస్కూల్ కోచ్ , ఫ్రీలాన్స్ రైటింగ్ వంటి పార్ట్ టైమ్ ఉద్యోగాలతో మరో 27వేల డాలర్లు ఆర్జిస్తోంది. 2017లో, ఆమె స్పాన్సర్‌షిప్ డీల్స్‌ ద్వారా డబ్బు సంపాదిస్తోంది. కాగా తన డొమైన్ పేరుకోసం కేవలం 12 డాలర్లు, వెబ్‌సైట్ హోస్ట్‌లో 50 డాలర్లు, టెక్సాస్‌లో కంపెనీని స్థాపించడానికి 308 డాలర్లు ఖర్చు చేసింది. వెబ్‌సైట్ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌పై  న్యాయవాదికి 900 డాలర్లు మాత్రమే ఆమె ఖర్చు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top