గూగుల్‌ నాకందుకే ప్రమోషన్‌ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు

Ex Google employee claims he was denied promotion for being white man - Sakshi

Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్‌ దిగ్గజం గూగుల్‌పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్‌ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. 

కాలిఫోర్నియాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్‌గా చెప్పమంటారా?" అంటూ మాగైర్‌ గతేడాది డిసెంబర్‌లో ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ పోస్ట్ పెట్టారు. 

గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్‌ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్‌ని మాగ్యురే  పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్ర​మోట్‌ చేయలేనని అతని సూపర్‌వైజర్ చెప్పినట్లు మాగైర్‌ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్‌ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు.

అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్‌. సెక్వోయాలో అతనికి  శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్‌ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్‌ 2016 నుంచి 2019 మధ్య గూగుల్‌లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్‌లో భాగస్వామిగా ఉన్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top