11,500 పైకి నిఫ్టీ

European Markets Started At Profit - Sakshi

లాభాల్లో మొదలైన యూరప్‌ మార్కెట్లు  

ఈ జోష్‌తో మన దగ్గర చివర్లో కొనుగోళ్లు  

39,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌ 

230 పాయింట్ల లాభంతో 39,074 వద్ద ముగింపు  

77 పాయింట్లు పెరిగి 11,550కు నిఫ్టీ

చివరి గంటలో కొనుగోళ్ల జోరుతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయినా  3 పైసల లాభంతో 74.30 వద్ద ముగియడం....  కలసి వచ్చాయి. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లపైకి, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆగస్టు డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో నెలలో ముగియనుండటంతో సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్ల లాభంతో 39,074 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,550 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది.  మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ ఎగిశాయి. 2020 జనవరి తర్వాత ఈ సూచీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి.  

యూరప్‌ మార్కెట్ల జోష్‌..! 
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ. నష్టాల మధ్య దోబూచులాడాయి. జర్మనీ, ఫ్రా¯Œ ్సల్లో అదనంగా మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చన్న అంచనాలతో యూరప్‌ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లో చివరి గంటలో  కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో 79 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 268 పాయింట్లు ఎగసింది. రోజంతా 347 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.2,137 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 230 పాయింట్ల లాభంలో దాదాపు సగం వాటా ఈ షేర్‌దే.  
టూవీలర్లపై జీఎస్‌టీని తగ్గిస్తారన్న అంచనాలతో టూవీలర్‌ కంపెనీ ∙షేర్లు లాభపడ్డాయి. హీరో మోటొకార్ప్, టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో షేర్లు 2–6 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
టాటా మోటార్స్‌ షేర్‌ లాభాలు కొనసాగాయి. 8 శాతం లాభంతో రూ.137 వద్ద ముగిసింది. మూడేళ్లలో రుణ భారాన్ని పూర్తిగా తగ్గించుకుంటామని ఈ కంపెనీ మంగళవారం పేర్కొంది.  
దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వాబ్‌కో ఇండియా, హీరో మోటోకార్ప్, ఆఫిల్‌ ఇండియా, అదానీ గ్యాస్, ఇమామి, తాన్లా  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. డిష్‌ టీవీ, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనా¯Œ ్స, రెప్కో హోమ్‌ ఫైనా¯Œ ్స, వెల్‌స్ప¯Œ  ఇండియా, సుబెక్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

11,850కు నిఫ్టీ...!
నిఫ్టీ 11,500 పాయింట్ల కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో   నేడు(గురువారం) ఆగస్టు సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగవచ్చని చార్ట్‌వ్యూఇండియాడాట్‌ ఇన్‌ ఎనలిస్ట్‌ మజ్‌హర్‌ మహ్మద్‌ అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సమీప భవిష్యత్తులో 11,850కు చేరవచ్చన్నారు. కాగా దాదాపు అన్ని కీలక నిరోధాలను నిఫ్టీ అధిగమించిందని కొందరు టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ  11,400 ఎగువన కొనసాగినంత కాలం ఇదే జోరు ఉంటుందని,  ఈ స్థాయి కంటే దిగువకు  వస్తే, తదుపరి మద్దతు 11.250 పాయింట్లని వారంటున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top