విద్యుత్‌ రంగంలో అదానీ! ట్రాన్స్‌మిషన్‌ లైన్ల కోసం వేలకోట్ల పెట్టుబడులు! | Essar Power to sell transmission line to Adani for Rs 1913 crore | Sakshi
Sakshi News home page

అదానీ చేతికి ఎస్సార్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌, వేల కోట్ల ఢీల్‌!

Jun 4 2022 3:45 AM | Updated on Jun 4 2022 8:44 AM

Essar Power to sell transmission line to Adani for Rs 1913 crore - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ దిగ్గజాలు అదానీ ట్రాన్స్‌మిషన్, ఎస్సార్‌ పవర్‌ లిమిటెడ్‌ మధ్య తాజాగా రూ. 1,913 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా ఎస్సార్‌ పవర్‌కు చెందిన విద్యుత్‌ ప్రసార లైన్లను అదానీ ట్రాన్స్‌మిషన్‌ కొనుగోలు చేయనుంది. దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే భారీ రుణ భారాన్ని తగ్గించుకుంటున్న ఎస్సార్‌ ఈ వ్యూహంలో భాగంగానే తాజా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గత మూడేళ్లలో కంపెనీ రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ. 1.8 లక్షల కోట్లకుపైగా చెల్లించింది.

కాగా.. రెండు ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ అనుబంధ సంస్థలలో ఒక కంపెనీని అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎస్సార్‌ పవర్‌ వెల్లడించింది. మహన్‌ నుంచి సైపట్‌ పూలింగ్‌ సబ్‌స్టేషన్‌ వరకూ 465 కిలోమీటర్లమేర మూడు రాష్ట్రాలలో విస్తరించిన ఎస్సార్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీని అదానీ ట్రాన్స్‌మిషన్‌కు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది.  
ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 285 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement