మార్కెట్ పతనంలోనూ 31 శాతం అప్
సెప్టెంబర్‌లో రూ.38,306 కోట్ల నికర పెట్టుబడులు
ఆల్‌టైమ్ గరిష్టానికి సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్
విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వరుస విక్రయాలతో మార్కెట్లు బేర్‌మంటున్నా.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మాత్రం దుమ్మురేపుతున్నాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.38,306 కోట్ల నికర పెట్టుబడులు పోటెత్తాయి. ఆగస్టులో నమోదైన 29,329 కోట్లతో పోలిస్తే 31 శాతం జంప్ చేశాయి. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణంకాల ప్రకారం.. అయిదు నెలల తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో ఈక్విటీ స్కీమ్స్‌లోకి నిధులు వెల్లువెత్తడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.38,440 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ లభించాయి.
స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ.. ప్రతి పతనం ఒక మంచి పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుండం వల్లే ఫండ్స్ ఈ స్థాయిలో నిధులను ఆకర్షించగలుగుతున్నాయని ఇన్‌క్రెడ్ మనీ సీఈఓ నితిన్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఎఫ్‌పీఐలు పొలోమంటూ అమ్మేస్తుండటతో సెపె్టంబర్‌లో ఈక్విటీ మార్కెట్ భారీ కరెక్షన్‌కు గురైంది. అయినప్పటికీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు జోరందుకోవడం ప్రోత్సాహాన్నిస్తోంది’ అని మారి్నంట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో జోరు చూస్తుంటే, ఇన్వెస్టర్లు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను మించి ఆలోచిస్తున్నారని.. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలున్న విభాగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు గ్రో మ్యూచువల్ ఫండ్ సీఈఓ వరుణ్ గుప్తా పేర్కొన్నారు.
యాంఫీ గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెపె్టంబర్‌లో ఇన్వెస్టర్లు సిప్‌ల ద్వారా ఫండ్స్‌లోకి రూ.32,490 కోట్లు కుమ్మరించారు. ఆగస్టులో రూ. 32,297 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
విభాగాల వారీగా చూస్తే, స్మాల్ క్యాప్ ఫండ్స్ సెపె్టంబర్‌లో నికరంగా రూ.9,039 కోట్లు ఆకర్షించాయి. ఆగస్టులో ఈ మొత్తం రూ.7,973 కోట్లుగా ఉంది. మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ. 6,989 కోట్ల నుంచి రూ. 7,835 కోట్లకు
ఎగబాకాయి.ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూ.6,702 కోట్లను ఆకర్షించగా.. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో మూడు నెలల తర్వాత మళ్లీ నికర పెట్టుబడులు నమోదయ్యాయి. రూ. 859 కోట్లు వచ్చాయి. నాణ్యమైన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోకి ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్నారనడానికి ఇది నిదర్శనం.
మరోపక్క, డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నారు. సెపె్టంబర్‌లో ఏకంగా రూ. 1.83 లక్షల కోట్ల నికర అమ్మకాలు నమోదయ్యాయి. ఆగస్టులో రూ.8,127 కోట్ల విత్‌డ్రాలతో పోలిస్తే ఈ మొత్తం గణనీయంగా ఎగబాకింది.
కాగా, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తంమీద చూస్తే నికరంగా రూ.1.33 లక్షల కోట్ల నిధులను ఉపసంహరించుకోవడం విశేషం. ఆగస్టులో నికర అమ్మకాలు రూ. 41,354 కోట్లు మాత్రమే.
ఎంఎఫ్‌ల మొత్తం నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెపె్టంబర్ నాటికి రూ.82.64 లక్షల కోట్లకు తగ్గాయి. ఆగస్టు చివరికి ఏయూఎం రూ.87.07 లక్షల కోట్లుగా నమోదైంది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్...
గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్సే్చంజ్ ట్రెడెడ్ ఫండ్స్) జిగేల్‌మన్నాయి. సెపె్టంబర్‌లో రూ. 4,451 కోట్ల నిధులు ఇందులోకి ప్రవహించాయి. ఆగస్టులో రూ.2,597 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. కాగా, గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ.1.86 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇటీవలి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరువవుతోంది. ఇక సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా రూ.1,974 కోట్ల నికర పెట్టుబడులను ఆకర్షించాయి.
ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్ షాపింగ్.. బీ అలర్ట్!


