ఈపీఎఫ్‌వో పాత ఖాతాల యాక్టివేషన్‌  | EPFO will launch an Aadhaar-based portal | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వో పాత ఖాతాల యాక్టివేషన్‌ 

Apr 30 2026 4:30 AM | Updated on Apr 30 2026 7:56 AM

EPFO will launch an Aadhaar-based portal

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో పాత ఖాతాలు, కార్యకలాపాల్లేని వాటిని  గుర్తించడంతోపాటు పునరుద్ధరించుకునేందుకు (యాక్టివేషన్‌) త్వరలోనే ఒక పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. ఇ–ప్రాప్తి పోర్టల్‌పై ఆధార్‌ ధ్రువీకరణతో, పాత ఈపీఎఫ్‌ ఖాతా వివరాలను పొందొచ్చు. 

యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) లేని ఖాతాలను లింక్‌ చేసుకుని, యాక్టివేట్‌ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ తెలిపారు. 2014 నుంచి ఈపీఎఫ్‌వో సభ్యులకు 12 అంకెలతో కూడిన యూఏఎన్‌ను జారీ చేస్తుండడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement