
బెంగళూరు: ‘నేనో సంస్థలో పనిచేస్తున్నా. సదరు సంస్థ నన్ను ఉద్యోగిలా కాకుండా టాయిలెట్ పేపర్‌లా ట్రీట్ చేసింది. అందుకే ఈ కంపెనీకి నేను రాజీనామా చేస్తున్నా’నంటూ ఓ ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేశాడు. ప్రస్తుతం, టాయిలెట్ పేపర్ మీద (Toilet Paper Resignation) రాసిన ఆ రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

రిజిగ్నేషన్ లెటర్ అంటే ఫ్రమ్ నుంచి టూ వరకు ఉద్యోగి వివరాలు, రిజిగ్నేషన్‌కి గల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇటీవల కాలంలో పలువురు ఉద్యోగులు కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్లు మూడే మూడు ముక్కల్లో రాజీనామా గురించి తేల్చేస్తున్నారు. హెచ్‌ఆర్‌లకు రిజిగ్నేషన్ లెటర్లు పంపిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి ఏడే ఏడు పదాల్లో తన రిజిగ్నేషన్‌ను సమర్పించాడు. ఇప్పుడు మరో ఉద్యోగి ఓ టాయిలెట్ పేపర్ మీద తన రిజిగ్నేషన్ చేశాడు. సింగపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన లింక్డిన్ పోస్టులో సదరు ఉద్యోగి ఇచ్చిన రాజీనామా లేఖను పోస్టు చేశారు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నన్ను ఈ కంపెనీ టాయిలెట్ పేపర్‌లా (Felt Like Toilet Paper) ఉపయోగించుకుంది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంది. అవసరం తీరిన తర్వాత నన్ను వదిలేసింది అంటూ ఉద్యోగి కంపెనీపై తన బాధను వెళ్లగక్కాడు. తన స్వహస్తాలతో రాసిన టాయిలెట్ పేపర్ రిజిగ్నేషన్‌లో ఈ కంపెనీ నాకు ఎలా విలువ ఇవ్వలేదో, అదే విధంగా నేను కూడా ఆ కంపెనీకి విలువ ఇవ్వాలని అనుకోవడం లేదు. అందుకే టాయిలెట్ పేపర్ మీద నా రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆ కంపెనీ డైరెక్టర్ ఏంజెలా యెఓహ్ స్వయంగా లింక్డిన్‌లో షేర్ చేయడమే కాదు. ఉద్యోగుల పట్ల సంస్థలు ఎలా ఉండాలో తెలిపారు. ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసే వెళ్లే సమయంలో కృతజ్ఞతతో వెళ్లేలా మనం వాళ్లను సంతోషంగా ఉంచాలి. వారి విలువను గుర్తించాలి’ అని విజ్ఞప్తి చేశారు.