
ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ (ట్విటర్)లో వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు అమెరికన్ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీనిపైన తాజాగా మస్క్ స్పందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
అమెరికన్ కంపెనీలైన యాపిల్, డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్‌వర్క్, కామ్‌కాస్ట్ ఇక మీద ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని గత వారంలో వెల్లడించాయి.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. ఈ కారణంగానే దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
ప్రకటనలు నిలిపివేస్తామన్న కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా తీసుకుని, బెదిరించాలనుకున్నట్లు, అలాంటి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లాలనుకునే వారి వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై సదరు కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సిన విషయం.