Elon Musk: Tesla Cancels June Hiring Events For China - Sakshi
Sakshi News home page

చైనాకి ఝలక్‌ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. అకస్మాత్తుగా రద్దు నిర్ణయాలు..

Jun 10 2022 10:32 AM | Updated on Jun 10 2022 11:59 AM

Elon Musk: Tesla Cancels June Hiring Events For China - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా, దాని యజమాని ఎలాన్‌మస్క్‌ చైనాకు ఝలక్‌ ఇచ్చారు. చెప్పాపెట్టకుండా చైనాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి పారేశారు. టెస్లా వంటి పెద్ద కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కార్పొరేట్‌ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

షాంగై ఈవెంట్స్‌
టెస్లా కంపెనీకి అమెరికా వెలుపల జర్మనీ, చైనాలలోనే కార్ల తయారీకి సంబంధించి గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో చైనాలోని షాంగైలో ఉన్న ఫ్యాక్టరీ అతి పెద్దది. టెస్లా ఉత్పత్తులు సగం ఇక్కడే తయారవుతుండగా లాభాల్లో నాలుగో వంతు ఈ ఫ్యాక్టరీ అందిస్తోంది. వ్యూహాత్మకంగా షాంగై ఫ్యాక్టరీ టెస్లాకు ఎంతో కీలకం. అందువల్ల ఇక్కడ క్రమం తప్పకుండా టెస్లా తరఫున ఈవెంట్స్‌ నిర్వహిస్తుంటారు ఎలాన్‌మస్క్‌.

ఉన్నపళంగా రద్దు
సేల్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, సప్లై చెయిన్‌ విభాగాల్లో నియమాకాల కోసం వరుసగా ఈవెంట్స్‌ చైనాలో నిర్వహించాలని టెస్లా నిర్ణయించింది. ఈ మేరకు 2022 జూన్‌ 16, 23, 30 తేదీలను ఎంపిక చేశారు. ఈ మేరకు చైనాలో విస్త్రృతంగా ప్రచారం చేశారు. టెస్లా కంపెనీలో ఉద్యోగాల కోసం అక్కడి యువత సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో జూన్‌ 9న మరో ప్రకటన వెలువడింది. అందులో జూన్‌లో నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్ట్టుగా పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలను ఎక్కడా వివరించలేదు. 

కారణం అదేనా
ఇటీవల ఎలాన్‌ మస్క్‌ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలకాలని ఉద్యోగులకు పిలుపు నిచ్చాడు. ఎవరైనా వర్క్‌ ఫ్రం హోం కావాలని అనుకుంటూ కంపెనీని వీడి వెళ్లవచ్చంటూ ఎగ్జిట్‌ గేట్‌ చూపించాడు. అంతేకాదు టెస్లాలో కొన్ని చోట్ల అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారంటు కామెంట్‌ చేశారు. దీంతో చైనాలోని షాంగై గిగా ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనే భావన టెస్లా బాస్‌ ఉండటం వల్లే ఈవెంట్స్‌ క్యాన్సెల్‌ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. 

ఇలా చేస్తే..
మరోవైపు చైనాలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడ ఈవెంట్స్‌ నిర్వహించి రిస్క్‌ తీసుకోవడం ఎందుకనే భావన టెస్లాలో ఉందంటున్నారు. కానీ టెస్లా వంటి పెద్ద కంపెనీ అకస్మాత్తుగా ఈవెంట్స్‌ రద్దు చేయడం అనేది చైనా బ్రాండ్‌ ఇమేజ్‌కి కొంత మేర డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంది.

చదవండి: Elon Musk: ఈలాన్‌ మస్క్‌ మరో సంచలనం: షాక్‌లో ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement