Elon Musk: ఈలాన్‌ మస్క్‌ మరో సంచలనం: షాక్‌లో ఉద్యోగులు

Tesla Needs Cut Staff By10 Percent Pause All Hiring Worldwide Elon Musk - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఈలాన్ మస్క్  మరోసారి సంచలచన వ్యాఖ్యలు  చేశారు. ఇక వర్క్‌ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీసులకు రండి.. లేదంటే కంపెనీని వీడండి అంటూ తన ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్‌ తాజాగా మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రస్తుత తరుణంలో  ఆర్థికవ్యవస్థపై  "సూపర్ బ్యాడ్ ఫీలింగ్" ఉందని, ఈ నేపథ్యంలో దాదాపు 10శాతం సిబ్బందిని  తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.  ఈ మేరకు  ఉద్యోగులకు అంతర్గత మెయిల్స్‌  ద్వారా సమాచారం ఇచ్చినట్టు  రాయిటర్స్ పేర్కొంది.

అంతేకాదు ‘‘ప్రపంచవ్యాప్త నియామకాలన్నింటినీ నిలిపివేయండి’’ అంటూ టెస్లా ఎగ్జిక్యూటివ్‌లకు మస్క్‌ నిన్న (గురువారం) ఈ ఇమెయిల్ పంపినట్టు తెలుస్తోంది.  అయితే దీనిపై  టెస్లా  ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

కాగా ఇంటినుంచి పనిచేస్తున్న టెస్లా ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని లేదా ఉద్యోగాలు మానెయ్యొచ్చని పేర్కొన్నారు. టెస్లాలో ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 40 గంటలు కార్యాలయంలోనే పనిచేయాల్సి ఉంటుందని మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఆదేశించారు. లేదంటే రిజైన్‌ చేసినట్టుగా భావిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top