
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విటర్‌లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ట్విటర్ లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది.
ట్విటర్ లోగో మార్పుతోపాటు ఇతర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాజాగా ట్విటర్ హోమ్‌పేజీకి దారితీసే కొత్త లింక్‌ను ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. 'X.com ఇప్పుడు twitter.com కి తీసుకెళ్తుంది. కొత్త ఎక్స్ లోగో ఈరోజు (జులై 24) అమల్లోకి వస్తుంది' అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ తన ట్విటర్ బయోలో కొత్త లింక్‌ను కూడా షేర్ చేశారు. మస్క్ ప్రకటన తర్వాత ట్విటర్ సీఈఓ లిండా యాకారినో కూడా తన మొదటి స్పందనను పంచుకున్నారు. ఎక్స్ అనేది భవిష్యత్‌లో యూజర్లకు ఆడియో, వీడియో, మెసేజింగ్, చెల్లింపులు, బ్యాంకింగ్ వంటి అపరిమిత సేవలు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఆధారితమైన ‘ఎక్స్’ ఊహించని రీతిలో అందరినీ కలుపుతుందని వివరించారు.
ఇదీ చదవండి ➤ Twitter Advertising Loss: పాపం ట్విటర్! సగానికి సగం పడిపోయింది..
ట్విటర్‌ను ఇప్పటికే X.corp అనే పేరుతో రిజస్టర్ చేసినట్లు గత మే నెలలో ట్విటర్ వెల్లడించింది. ట్విటర్‌ను చైనాకు చెందిన వుయ్‌చాట్ మాదిరిగా పేమెంట్‌లు, మెసేజింగ్, జాబ్ సెర్చ్ తదితర ఫీచర్లతో సూపర్ యాప్‌గా మార్చాలన్న ఎలాన్ మస్క్ ఆలోచనకు అనుగుణంగా మార్పులు చకాచకా జరిగిపోతూ వచ్చాయి.
Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO
— Elon Musk (@elonmusk) July 24, 2023