సంచలన నిర్ణయం.. బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల్ని అమ్మిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk Sell Bitcoin Holdings Around 373 Million - Sakshi

అమెరికా స్పేస్‌ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్‌ కాయిన్‌లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్‌ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మస్క్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో బిట్‌కాయిన్‌ మార్కెట్‌ భారీగా కుప్పకూలింది. స్పేస్‌ఎక్స్‌ బిట్‌కాయిన్‌ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్‌కాయిన్‌ మార్కెట్‌ క్రాష్‌ అయ్యింది. 800 మిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్‌ఎక్స్ తన బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్‌లను అమ్మడం బిట్‌ కాయిన్‌ మార్కెట్‌లో అలజడి సృష్టించింది. అయినప్పటికీ, స్పేస్‌ ఎక్స్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 

టప్‌ మని పేలిన బిట్‌కాయిన్‌ బుడగ
పలు నివేదికల ప్రకారం, బిట్‌కాయిన్ బుడగ పేలింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి  $26,000 కంటే తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుండి బిట్‌కాయిన్ 9 శాతం క్షీణించింది.

చదవండి👉 : ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top