World's Richest Man: ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, మరెవరో తెలుసా?

Elon musk no longer worlds richest person - Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఎలాన్ మస్క్ మళ్ళీ కోల్పోయాడు. మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే కిందికి వచ్చేసారు. ఈ విషయాన్ని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ ధర రెండు ట్రేడింగ్ సెషన్‍లలో 7శాతానికిపైగా పడిపోయింది. దీనితో మస్క్ సంపద 176 మిలియన్లకు చేరింది.

ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో 187.1 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానాన్ని పొందిన ఎలాన్ మస్క్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు. ప్రస్తుతం అర్నాల్ట్ సంపద 187 బిలియన్ డాలర్లు.

(ఇదీ చదవండి: Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు)

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ 79.9 బిలియన్ డాలర్ల సంపాదనతో 11 స్థానంలో, గౌతమ్ అదానీ 44.7 బిలియన్ డాలర్ల సంపాదనతో 28వ స్థానంలో నిలిచారు. చైనాలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల, అదే సమయంలో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకోవడం వల్ల టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీనితో చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు చాలా తగ్గిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top