Mahindra Thar RWD Price Hiked in India; Check Details - Sakshi
Sakshi News home page

Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు

Published Fri, Mar 3 2023 11:49 AM

Mahindra thar rwd price hiked details - Sakshi

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ ఇటీవల ఆర్‌డబ్ల్యుడి వెర్షన్‌గా పుట్టుకొచ్చింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు, అప్పుడే దీని ధరలు భారీగా పెరిగాయి. 

మహీంద్రా థార్ RWD (రియర్-వీల్-డ్రైవ్) ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ప్రారంభంలో కేవలం మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. థార్ ఆర్‌డబ్ల్యుడి AX(O) డీజిల్ MT, LX డీజిల్ MT, LX పెట్రోల్ AT వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

మహీంద్రా థార్ ఎల్ఎక్స్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధరలను మాత్రమే కంపెనీ రూ. 50,000 పెంచింది. కావున ఈ SUV ధరలు ఇప్పుడు రూ. 11.49 లక్షలకు చేరింది. మిగిలిన రెండు వేరియంట్ ధరలు మునుపటి మాదిరిగానే ఉన్నాయి.

సరికొత్త మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడిలో ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ దాని 4డబ్ల్యుడి వేరియంట్ మాదిరిగా అదే పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, థార్ ఆర్‌డబ్ల్యుడి మోడల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 117 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ డీజిల్ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్‌ వేరియంట్ అందుబాటులో లేదు.

మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడి బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఈ కొత్త ఆఫ్ రోడర్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేసే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి కూడా ఇందులో ఉంటాయి.

Advertisement
Advertisement