Byju Has Temporarily Halted: షారుక్‌ ప్రకటనలు నిలిపేసిన ఎడ్‌ టెక్‌ దిగ్గజం బైజూస్‌

Edtech Major Byju Has Temporarily Halted Shah Rukh Khan Advertisements Due To His Son Aryan Khan Drugs Case - Sakshi

ముంబై: ఐపీఓ బౌండ్‌ టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థ బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌కి సంబంధించిన ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది.  ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరోసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 

(చదవండి: అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది")
అంతేకాదు ఆ అడ్వర్టైస్‌మెంట్‌లో స్టూడెంట్స్‌ ఎలా చదువుకోవాలో ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు ఏవిధంగా చదువులో సాయం చేయాలి వంటివి వివరించే ప్రకటనలు కావడం విశేషం. ఒక బాధ్యత గల తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోవడం ఏమిటో అంటూ విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పై వివరణ ఇవ్వడానికీ కూడా బైజు సంస్థ నిరాకరించింది.

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌లు ఆర్యన్‌ చిన్నపిల్లవాడు అతనికి బైలు ఇవ్వాల్సిందే అంటూ ... షారుక్‌ మద్దతు ఇస్తున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల వ్యవహారం మాత్రం షారుక్‌ సినీ కెరియర్‌కి పెద్ద ఎదురు దెబ్బ. రాజకీయ నాయకులు ఒక్కసారిగా వారి పదవీ ఊడిపోతే వారికి అప్పటివరకు జరుగుతున్న రాజమర్యాదలన్ని ఏవిధంగా కనుమరుగైపోతాయో అలా ఈ సినీ స్టార్‌ల పరిస్థితి కూడా ఇంతేలా ఉంది. ఒక్క అనూహ్యమైన సంఘటనతో వాళ్ల స్టార్‌డమ్‌ కూడా ఏ మాత్రం పనిచేయదు అంటే అతిశయోక్తి కాదేమో.

(చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top