కరోనాలోను 30 వేల ఉద్యోగాలు.. | Ecom Express Planning To Hire Employees | Sakshi
Sakshi News home page

కరోనాలోను 30 వేల ఉద్యోగాలు..

Sep 14 2020 9:27 PM | Updated on Sep 14 2020 9:27 PM

Ecom Express Planning To Hire Employees - Sakshi

ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ ఈకామ్‌ ఎక్ప్‌ప్రెస్ అనే లాజిస్టిక్స్‌ కంపెనీ 30,000మంది ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. త్వరలో పండగ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. కాగా విజయవాడ, అమ్మాదాబాద్‌, సూరత్‌, ఇండోర్‌, పాట్నా, జైపూర్‌ తదితర ప్రాంతాలలో నియామకాలు చేపడతామని సంస్థ పేర్కొంది. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యతిస్తున్నందున ఎక్కువ స్థాయిలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దేశంలో వివిధ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement