డ్రోన్లతో మేఘాలకు ఎలక్ట్రిక్‌ షాక్‌..! కట్‌ చేస్తే..

Dubai Creates Fake Rain Using Drones To Beat The Heat - Sakshi

దుబాయ్‌: మానవుడు తన మేధస్సుతో అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీనుపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా చేస్తున్నాడు. క్లౌడ్‌ సీడింగ్‌తో పోలిస్తే.. మరింత తక్కువ ఖర్చుతో కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా శాస్త్రవేత్తలు మరో ఆవిష్కరణను రూపొందించారు.

యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లాంటి ఏడారి దేశాల్లో వీపరితమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగేలా కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా కొత్త ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు పురుడుపోశారు. డ్రోన్లతో మేఘాలను విద్యుత్‌ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. దుబాయ్‌లో తాజాగా ఈ టెక్నాలజీనుపయోగించి 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలను అధిగమించి కృత్రిమ వర్షం పడేలా శాస్త్రవేత్తలు చేశారు. దుబాయ్‌లో ఒక హైవేపై కృత్రిమ వర్షం పడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

క్లౌడ్‌ సీడింగ్‌ పోలిస్తే...
సాధారణంగా క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిలో సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిను 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు నమోదుచేస్తున్నాయి.ఈ ప్రక్రియను చేయడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు. యూఏఈ శాస్త్రవేత్తలు ఈ పద్దతికి బదులుగా కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేశారు. మేఘాల్లోకి డ్రోన్ల సహయంతో ఎలక్ట్రిక్‌ ఛార్జ్‌ను విడుదల చేయడంతో వర్షం పడేలా మేఘాలను ప్రేరేపిస్తుంది. ఇతర క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీ పోలిస్తే డ్రోన్లనుపయోగించి మేఘాలను ఎలక్ట్రిక్‌ ఛార్జ్‌ చేయడంతో కృత్రిమ వర్షపాతం కురిసేలా చేయడం మరింత​ సులువుకానుందని యూఏఈ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

డ్రోన్ల ఉపయోగం దుబాయ్‌లోనే కాదు...!
డ్రోన్లనుపయోగించి కేవలం దుబాయ్‌లో కృత్రిమ వర్షాలు చేస్తున్నారంటే పొరపడినట్లే.. అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందండం కోసం డ్రోన్ల సహాయంతో సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనాలను మేఘాలపై విస్తరింపజేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కృత్రిమ వర్షపాతం నమోదవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top