1.41 కోట్ల మంది విమానమెక్కారు.. | Domestic air passenger traffic rises to 1 4 crore | Sakshi
Sakshi News home page

1.41 కోట్ల మంది విమానమెక్కారు..

Jun 26 2025 10:50 AM | Updated on Jun 26 2025 11:45 AM

Domestic air passenger traffic rises to 1 4 crore

దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్‌ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.

ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్‌ వాటా ఎయిర్‌ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్‌ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్‌జెట్‌ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్‌ మార్కెట్‌ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్‌ జెట్‌ మార్కెట్‌ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.

ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్‌ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement