StockMarketHoliday బలిప్రతిపాద: స్టాక్‌మార్కెట్లకు సెలవు

Diwali Balipratipada BSE and NSE shut today - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు. బలిప్రతిపాద సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌సీఈ మార్కెట్లు పనిచేయవు. బులియన్‌ సహా హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్‌లు కూడా పనిచేయవు. ఫారెక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.

బలి ప్రతిపాదను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే ఈ పండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రోజుగా భావిస్తారు. కాగా అక్టోబర్ 25న, సెన్సెక్స్ 287.70 పాయింట్లు లేదా 0.48శాతం క్షీణించి 59,544 వద్ద  నిఫ్టీ 74.50 పాయింట్లు లేదా 0.42శాతం క్షీణించి 17,656 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top