బ్యాంకు లావాదేవీలు ఆన్‌‘లైన్‌’

Digital Banking in the times of a Covid-19 epidemic - Sakshi

కోవిడ్‌తో డిజిటల్‌కు మళ్లిన కస్టమర్లు

మొత్తం లావాదేవీల్లో 23 శాతానికి

బ్యాంకులకూ మహమ్మారి ఎఫెక్ట్‌

కొన్ని సేవలకే శాఖలు పరిమితం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు ముందు వరకు దేశంలో బ్యాంకు లావాదేవీల్లో ఆన్‌లైన్‌ వాటా కేవలం 2 శాతమే. డీమానిటైజేషన్‌ తర్వాత ఇది 6 శాతానికి వచ్చి చేరింది. ఇక కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా నగదు ముట్టుకోవడానికి ప్రజలు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. దీంతో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. మొత్తంగా రోజువారీ ఆన్‌లైన్‌ లావాదేవీలు గతేడాది 14% ఉంటే.. ప్రస్తుతం కోవిడ్‌  సెకండ్‌ వేవ్‌తో ఇది ఏకంగా 23%కి వచ్చింది. వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో బ్యాంకుకు వెళ్లడానికి కస్టమర్లు జంకుతుండడం.. బ్యాంకులు వ్యాపార పనివేళలు కుదించడమూ ప్రస్తుతం ఈ స్థాయి డిజిటల్‌ లావాదేవీలకు కారణమైంది. భారత్‌లో సగటున బ్యాంకు పనిదినాల్లో రోజుకు రూ.50,000–60,000 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం.

బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్‌..
కోవిడ్‌–19 మహమ్మారి బ్యాంకులకూ చుట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో 9.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12,000 పైచిలుకు ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. దాదాపు 600 మంది కోవిడ్‌–19కు బలయ్యారు. ఈ నేపథ్యంలో పనిగంటలు కుదించాల్సిందిగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) అన్ని బ్యాంకులను కోరింది. ఐబీఏ సూచనతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు ఇటీవల సమావేశమయ్యాయి. వ్యాపార పనివేళలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ఉద్యోగుల పని గంటలు సాయంత్రం 4 వరకు ఉండాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాయి. ప్రభుత్వాల అంగీకారంతో చాలా రాష్ట్రాలు ఈ పనివేళలను అమలు చేస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.  

ఆ నాలుగు సేవలే..: కరోనా కట్టడిలో భాగంగా బ్యాంకులు తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 50% మంది ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో ప్రోత్సహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 10 శాతంలోపు బ్యాంకు ఉద్యోగులే ఇంటి నుంచి పని విధానంలో విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వ్యాపార పనివేళలు కుదించిన నేపథ్యంలో డిపాజిట్స్, క్యాష్‌ విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్, ప్రభుత్యానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే బ్యాంకులు అందిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా అడ్డంకులు లేవని ఒక అధికారి వ్యాఖ్యానించారు. వినియోగదార్లు ఏటీఎంలు, పేమెంట్స్‌ యాప్స్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వేదికలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని తెలిపారు.

50 శాతం చేయాల్సిందే..
బ్యాంకులన్నీ సగం మంది ఉద్యోగులను షిఫ్ట్‌ విధానంలో ఇంటి నుంచి పనిచేసేలా వెసులుబాటు కల్పించాలి. మధ్యాహ్నం 2 గంటలకల్లా శాఖలను మూసివేయాలి. వైరస్‌ ఉధృతి తగ్గేవరకు వికలాంగులు, గర్భిణులు, 55 ఏళ్లకుపైబడ్డ వారిని సెలవులో ఉంచాలి. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలోని శాఖలను పూర్తిగా మూసివేయాలి. శిక్షణ కేంద్రాలను కోవిడ్‌ సెంటర్లుగా మార్చాలి. బ్యాంకులు సీఎస్‌ఆర్‌ కింద 3 శాతం మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలన్నది మా డిమాండ్‌.

– బి.ఎస్‌.రాంబాబు, తెలంగాణ కన్వీనర్, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2022
May 12, 2022, 15:33 IST
న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి...
08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు... 

Read also in:
Back to Top