స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేస్తారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌..! | Dhani Launches Zero Brokerage Trading Platform | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేస్తారా..! జీరో బ్రోకరేజ్‌ ఛార్జీలు..ఇంకా..

Feb 2 2022 6:56 PM | Updated on Feb 2 2022 6:57 PM

Dhani Launches Zero Brokerage Trading Platform - Sakshi

స్టాక్స్‌ మార్కెట్స్‌లో ట్రేడింగ్‌ చేసే వారికోసం ప్రముఖ ఫైనాన్షియల్‌ సంస్థ ధని స్టాక్స్ లిమిటెడ్ సరికొత్త ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం ధని స్టాక్స్‌ను లాంచ్‌ చేసింది. ఈక్విటీ, ఎఫ్&ఓ, ఇంట్రా-డే, డెలివరీతో సహా అన్ని విభాగాలలో ట్రేడర్స్‌కు జీరో బ్రోకరేజీతో సేవలను అందించనుంది. 

ధని యాప్‌..! ఒక క్లిక్‌తో లాగిన్‌..
ట్రేడర్స్‌ను దృష్టిలో ఉంచుకొని ధని స్టాక్స్‌ లిమిడెట్‌ కంపెనీ ధనీ యాప్‌లో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంను జత చేసింది. ఒక క్లిక్‌తో ట్రేడర్స్‌ లాగిన్‌ అయ్యే విధంగా యాప్‌ను రూపొందించింది.  ఈ యాప్‌ను 'లెస్‌ ఈజ్‌ మోర్‌' అనే థీమ్‌తో రూపొందించారు. ఈ యాప్‌తో ట్రేడర్స్‌కు స్టాక్స్‌ విషయంలో  అయోమయాన్ని తగ్గిస్తూ, ట్రేడింగ్‌ అనుభవాన్ని మరింత సరళంగా చేయనుంది. కొత్తగా ట్రేడింగ్‌ చేసే వారికోసం అకౌంట్ ఓపెనింగ్‌,  వార్షిక మెయింటెనెన్స్‌పై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. దాంతో పాటుగా ఎండ్ టు ఎండ్ ఆన్‌లైన్ ప్రాసెస్‌ను ట్రేడర్స్‌కు ధని అందించనుంది.

సరికొత్త UI/X డిజైన్‌తో ట్రేడింగ్ సంక్లిష్టతను వన్-క్లిక్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్, రియల్ టైమ్ కోట్స్‌, ఇన్-డెప్త్ స్టాక్ అనాలిసిస్, అనుకూలీకరించదగిన వాచ్‌లిస్ట్‌లు, ఐపీవో పెట్టుబడుల వంటి అంశాలను మరింత సులభతరం చేస్తుంది. దీంతో ట్రేడర్స్‌కు ట్రేడింగ్‌ సరళీకృతం అవుతోందని ధని స్టాక్స్ సీఈవో దివ్యేష్ షా అభిప్రాయపడ్డారు. 

చదవండి:  ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement