దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ‘అరణ్య భవనం’

Details about Indias first Vertical Forest Apartments at Hyderabad - Sakshi

హైదరాబాద్‌ నగరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా, ఏషియాలో రెండోదిగా హైదరాబాద్‌ నగరంలో వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ (అరణ్య భవనం) నిర్మాణం జరుపుకోబోతుంది. హైటెక్‌ సిటీ  ఈ ప్రతిష్టాత్మక భవనం నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. 

వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ను 360 డిగ్రీస్‌ లైఫ్‌ సంస్థ  ప్రాజెక్టును నిర్మించనుంది. సమీపంలో మూడు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మాణ పనులు 2024లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మొత్తం 30 అంతస్తులు ఉండగా 25 నివాసాలకు మిగిలిన ఐదు ఫ్లోర్లు పార్కింగ్‌ కోసం కేటాయించనున్నారు. మొత్తంగా ఈ భవంతిలో 288 ప్లాట్స్‌ ఉండబోతున్నాయి. 

ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రతీ ప్లాట్‌లో ప్రతీ అంతస్తులో చెట్లు వచ్చేలా ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు. చూడటానికి నిలువుగా విస్తరించిన అడవిలా ఈ భవనం కనిపిస్తుంది. ఇందులో ప్రతీ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీలో పళ్ల చెట్లు, బెడ్‌రూమ్‌ దగ్గర సువాసన వెదజల్లే చెట్లు, కిచెన్‌ దగ్గర కూరగాయల మొక్కలు వచ్చేలా భవనం ఉండబోతుంది. నలువైపుల నుంచి గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా చెట్లు పెరిగేందుకు అనువుగా అత్యున్నత టెక్నాలజీ వాడుతూ ఈ భవనం నిర్మించబోతున్నారు. 

ఏషియాలో చైనాలోని కివీ సిటీలో తొలి వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం జరగింది. అందులో 826 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దాని తర్వాత రెండో భవంతిని హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 

చదవండి: రియల్టీ చరిత్రలో ఇదో రికార్డ్‌.. భారీ ధరకు అమ్ముడైన దయ్యాల కొంప

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top