
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 50 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తైవాన్‌కి చెందిన డెల్టా ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజమిన్ లిన్ తెలిపారు. స్మార్ట్ తయారీ, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి భారత్ స్వయం సమృద్ధిని సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ’ఎలెక్‌రమా 2025’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.
బెంగళూరుకు దగ్గర్లోని కృష్ణగిరిలో ఉన్న ప్లాంటులో ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌కి అవసరమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెలికం పరిశ్రమలో ఉపయోగించే డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్లు, రెక్టిఫయర్లు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నామని లిన్ చెప్పారు. ఈ ప్లాంటును కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. 2003లో భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు లిన్ చెప్పారు.