వర్చువల్ మీటింగ్.. స్క్రీన్‌పై చెడ్డీలు.. వర్క్‌ టైమ్‌లో షాపింగ్‌ చేస్తే ఇలాగే ఉంటుంది!

Delhi man shares screen during work call stuck on very embarrassing page - Sakshi

కొన్ని ఐటీ సంస్థల్లో ఇప్పటికీ వర్క్‌ ఫ్రం హొమ్‌ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే హాయిగా పనిచేసుకుంటున్నారు. అయితే పని వేళల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమౌతుంది.

ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఇంటి నుంచి పని చేస్తున్న అతను వర్క్‌ టైమ్‌లో బాక్సర్ల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్ చేశాడు. ఇందు కోసం తన బ్రౌజర్‌లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్‌ చేశాడు. అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్‌ చేశాడు.

ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్‌ అయిపోయింది. ఇంకేముంది అతని ఆన్‌లైన్‌ చెడ్డీల షాపింగ్‌ పేజీని అందరూ చూసేశారు. అతను ఆ స్క్రీన్‌ మార్చడానికి వీలు లేకుండా పోయింది. ఆ వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్‌ మార్చరా నాయనా అంటూ ఎన్ని ఇన్‌కాల్‌ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది పాపం.

వర్క్‌ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్‌ సరదాగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశాడు. వర్క్‌టైమ్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు.

ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌కు షాక్‌! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top