ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త! | Deadline To Update Aadhaar Free Of Cost Extended | Sakshi
Sakshi News home page

ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త!

Dec 12 2023 9:51 PM | Updated on Dec 12 2023 9:54 PM

 Deadline To Update Aadhaar Free Of Cost Extended - Sakshi

ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త. ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాల్ని ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన సమయాన్ని  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది.

వాస్తవానికి ఆధార్‌ ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు డిసెంబర్‌ 14 వరకే ఇచ్చింది. అయితే తాజాగా ఆ గడువును  2024 మార్చి 14 వరకు పొడిగించింది. 

మరోవైపు, ఆధార్‌ కార్డ్‌ తీసుకుని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వినియోగదారులు వారి ఆధార్‌ కార్డ్‌లోని వివరాల్ని అప్‌డేట్‌ చేయాలని కోరిన విషయం తెలిసిందే. తద్వారా, పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement