Anand Mahindra Shared Olden Days Doordarshan Cricket Viral Videos, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

క్రికెట్‌ వైరల్‌ వీడియో: ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌, నెటిజన్ల నోస్టాల్జియా

Oct 17 2022 3:17 PM | Updated on Oct 17 2022 6:24 PM

Cricket on Doordarshan Viral vidie shares anand mahindra here reactions - Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌టీవీలు, శాటిలైట్‌ చానెల్స్‌ హవా రాకముందు దూరదర్శన్‌లో ప్రసారమయ్యే క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు భారీ క్రేజ్‌ ఉండేది. ఆయా మ్యాచ్‌ల లైవ్‌ చూసేందుకు జనం ఎగబడేవారు. నిజానికి రేడియో కామెంటరీ  తర్వాత విజువల్‌ పరంగా అదొక్కటే ప్రేక్షకులకు వరం.అయితే  పాత రోజుల్లో  యాంటెన్నా కష్టాలు, దూరదర్శన్‌లో క్రికెట్‌ అంటూ ఒక వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో బాగా హల్‌ చల్‌ చేస్తోంది. అలనాటి యాంటెన్నా, కరెంట్‌, పిక్చర్‌ క్వాలిటీ తదితర  కష్టాలను గుర్తుచేస్తున్న ఈవీడియో  సోషల్‌ మీడియాలో  నవ్వులు పూయిస్తోంది. 

ఇది చదవండి: కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త ఇకలేరు

తాజాగా ఈ వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఎవరైనా  ఈ వీడియోకి చక్కటి మ్యూజిక్‌ ట్రాక్‌ యాడ్‌ చేయండి అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు రకాల కమెంట్లతో సందడి చేస్తున్నారు. యాంటెన్నా  ఒక్కటే కాదు సార్! ఆ రోజుల్లో చాలా ఇళ్లలో బ్లాక్‌ అండ్‌ టీవీలు ఉండేవి. సో...పిక్చర్ ట్యూబ్ సమస్యలు కూడా చాలా కామన్‌గా కనిపించేవి కామెం​ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement