అంబానీ బుక్‌ చేసుకున్న క్రూయిజ్‌లో వెళ్తారా.. ఒక్కరోజుకి అన్ని లక్షలా? | Costs of Book a Night on The Luxury Cruise Ship Celebrity Ascent | Sakshi
Sakshi News home page

అంబానీ బుక్‌ చేసుకున్న క్రూయిజ్‌లో వెళ్తారా.. ఒక్కరోజుకి అన్ని లక్షలా?

Published Thu, Jun 6 2024 10:39 AM | Last Updated on Thu, Jun 6 2024 12:26 PM

Costs of Book a Night on The Luxury Cruise Ship Celebrity Ascent

జులైలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గతంలో జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇటీవలే మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ క్రూయిజ్ షిప్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక 29 మే నుంచి జూన్ 1 వరకు జరిగింది.

ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్‌లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూయిజ్ షిప్‌ విలాసవంతమైన సదుపాయాలను కలిగి ఉంటుంది.

గతంలో జామ్‌నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. ఈ సారి క్రూయిజ్ షిప్‌లో జరిగిన వేడుకలకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీనికి కూడా వేలకోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది.

క్రూయిజ్ షిప్‌లో బస చేయడానికి అయ్యే ఖర్చు
అంబానీ ఫ్యామిలి బుక్ చేసుకున్న సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్ షిప్‌లో ఒక రాత్రి బస చేయాలనంటే ఒక గదికి 1849 డాలర్ల నుంచి 2879 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 153705 నుంచి రూ. 239328 ఖర్చు అవుతుందని సమాచారం. సెలబ్రిటీ క్రూయిసెస్ ప్రకారం, ఓషన్-వ్యూ స్టేట్‌రూమ్ అండ్ సూట్ కోసం 5,736 డాలర్లు లేదా దాదాపు రూ. 4,76,828 వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.
 

👉 :​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement