ప్రణాళిక అనుగుణంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ | Corona virus Vaccine is Preparing as Per Plan: Arbindo Pharma | Sakshi
Sakshi News home page

ప్రణాళిక అనుగుణంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌

Sep 16 2020 8:11 AM | Updated on Sep 16 2020 8:11 AM

Corona virus Vaccine is Preparing as Per Plan: Arbindo Pharma - Sakshi

సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఫార్మా సంస్థ అరబిందో వెల్లడించింది. యూఎస్‌లోని సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్‌ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా ప్రీక్లినికల్‌ టెస్ట్, పరీక్ష, విశ్లేషణకై సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ టెస్ట్‌ లైసెన్స్‌ను అరబిందోకు జారీ చేసింది. వైరస్‌ల చికిత్సలో ఉపయోగించే వ్యాక్సిన్ల తయారీకై అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్లాంటును అరబిందో నెలకొల్పుతోంది. ఈ కేంద్రాన్ని కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తయారీకి సైతం ఉపయోగించనున్నారు. 

మద్దతుగా బీఐఆర్‌ఏసీ..: నేషనల్‌ బయోఫార్మా మిషన్‌లో భాగంగా బయోటెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి అరబిందోకు మద్దతుగా నిలిచింది. భారత్‌లో తొలిసారిగా ఆర్‌–వీఎస్‌వీ వ్యాక్సిన్‌ తయారీ ప్లాట్‌ఫాం ఏర్పాటును సులభతరం చేసింది. దేశ అవసరాల కోసం మహమ్మారితో పోరాటంలో భాగంగా వ్యాక్సిన్‌కై అరబిందో ఫార్మాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు బయోటెక్నాలజీ శాఖ సెక్రటరీ రేణు స్వరూప్‌ పేర్కొన్నారు. సంస్థ వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యంపై బీఐఆర్‌ఏసీ నమ్మకం ఉంచిందని, ఇది తమకు అపార గౌరవంగా ఉందని అరబిందో ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణకై అరబిందో, ఆరో వ్యాక్సి న్స్‌ నాయకత్వానికి విస్తృత అనుభవం ఉందన్నారు.

చదవండి: 15 సెకన్లలోనే వైరస్‌ అంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement